English | Telugu
ఆది ప్రేమ టీజర్ విడుదల
Updated : Mar 22, 2014
ఆది, శాన్వి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ప్యార్ మే పడిపోయానే". ఈ చిత్ర టీజర్ ను నిన్న హైదరాబాదులో విడుదల చేసారు. ప్రముఖ దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. వినోదం, సంగీతం మేళవింపుతో సాగే ఓ ప్రేమకథ ఇది. ఆది ఇందులో కొత్తగా కనిపించబోతున్నాడు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.