English | Telugu
దాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటున్న మిల్కీబ్యూటీ!
Updated : Jul 2, 2023
ఈ మధ్య కాలంలో ఏ హీరోయినూ కాని విధంగా ట్రెండ్ అయ్యారు తమన్నా భాటియా. బ్యాక్ టు బ్యాక్ రెండు వెబ్ సీరీస్‌లలో రెచ్చిపోయి నటించారు. ఇప్పటిదాకా స్క్రీన్ మీద హద్దుల్లో ఉన్న తమన్నా, ఇప్పుడు సరిహద్దులు చెరిపేశానని అంటున్నారు. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్-2 కి కామన్ ఆడియన్స్ నుంచి మాత్రమే కాదు, సెలబ్రిటీల నుంచి కూడా వావ్ అంటూ స్పందన వస్తోంది. తమన్నాలో ఈ యాంగిల్ ఊహించలేదు, ఇరగదీసేశారనే కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.
తమన్నా మాట్లాడుతూ "ఇంటిమేట్ సీన్స్‌ని నా ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడటానికి చాలా ఇబ్బందిపడిపోయేదాన్ని. టీవీలో ఆ సన్నివేశాలు రాగానే, చుట్టూ చూస్తూ కూర్చునేదాన్ని. లేకుంటే ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయేదాన్ని. చాలా అసహనంగా అనిపించేది. అందుకే నేను నటించిన సినిమాల్లోనూ అవి లేకుండా ఉండేలా జాగ్రత్తపడేదాన్ని. ఫిల్మ్ మేకర్స్ తో ముందే ఈ విషయం గురించి చర్చించేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. 15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చిన నేను అన్ని రకాల పాత్రలూ చేసేశాను. మానసికంగా ఎంతో పరిపక్వత వచ్చింది. దాన్నే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలని అనుకున్నాను. చేసిందే చేస్తానంటే ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. నా ప్రేక్షకులు బోర్ ఫీల్ కావడం నాకు నచ్చదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చేశాను. ఇంటిమేట్ సీన్లు కథలో భాగమైతే, చేయక తప్పకపోతే కచ్చితంగా చేయాలనుకుంటున్నాను. జీ కర్దాలోనూ, లస్ట్ స్టోరీస్‌లోనూ అందుకే చేయగలిగాను. నటిగా నాలోని మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే చేశాను. ఇప్పుడు వాటికి వస్తున్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తున్నాను" అని అన్నారు.
లస్ట్ స్టోరీస్‌లో తమన్నాతో కలిసి నటించారు విజయ్ వర్మ. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ అంటూ చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తను ఎక్కడుంటే అక్కడ హాయిగా ఉంటుందని తమన్నా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.