English | Telugu
జనతా గ్యారేజ్ లో తమన్నా కూడా ఉంది..!
Updated : Apr 19, 2016
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ సినిమాలో క్యాస్టింగ్ అంతా భారీగానే కనబడుతోంది. ఇఫ్పటి వరకూ మోహన్ లాల్, సాయి కుమార్, సమంత, నిత్యామీనన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో షూటింగ్ కు వెళ్లిన జనతా గ్యారేజ్ టీం, తాజాగా మూవీలోకి తమన్నాను కూడా తీసుకున్నారు. సినిమాలో వచ్చే మంచి ఐటెం సాంగ్ కు, తమన్నాను తీసుకోవాలని మూవీ టీం అనుకున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ తో ఊసరవెల్లిలో యాక్ట్ చేసిన తమన్నా కూడా అందుకు సై అన్నదని సమాచారం. స్పెషల్ సాంగ్స్ చేయడానికి తమన్నా ఎప్పుడూ వెనుకాడదు. అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో తళుకున మెరిసిన తమ్మూ, ఇప్పుడు తారక్ తో చిందేయబోతుందన్నమాట. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం, మల్లూవుడ్ యాక్టర్స్ తో క్యాస్టింగ్ కళకళలాడటం లాంటి కారణాల వల్ల మళయాళ, తమిళ మార్కెట్లలో కూడా జనతాగ్యారేజ్ కు పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఊపిరి సక్సెస్ తో ఉన్న తమన్నా అదృష్టం, తమ సినిమాకు కలిసివస్తుందనేది కూడా కొరటాల నమ్మకమట.