English | Telugu
బాబాయ్ అబ్బాయ్‌లపై రవితేజ ఇన్‌డైరెక్ట్ కామెంట్?
Updated : Apr 19, 2016
రవితేజ..తెలుగు చిత్రపరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగి హీరోగా తనకంటూ సెపరేట్ స్టైల్, మ్యానరిజమ్‌తో దూసుకుపోతున్న స్టార్. అందరు హీరోలతో కలివిడిగా ఉంటూ ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు రవి. ఎప్పుడూ ఎవరిని పల్లెత్తు మాట అనని రవి తాజాగా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది.
కేవలం మాస్‌ని దృష్టిలో పెట్టుకుని మాస్ సినిమాలతో బాలీవుడ్‌లో సినిమాలు చేస్తే ఫలితం వేరేలా ఉంటుంది, వైవిధ్యమైన కథలతో బాలీవుడ్‌లో సినిమాలు చేయడం బెటర్ అంటూ కామెంట్ చేశాడు. దీనిని బట్టి చూస్తే రవితేజ పవన్, రామ్ చరణ్‌లపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేసినట్లుంది. ఎందుకంటే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. చెర్రి జంజీర్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇవి రెండు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. చరణ్ మరోసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన రవి వారిద్దరిపై కామెంట్ చేసేంత ధైర్యం చేశాడా? లేక మరేవరిపైనైనా కామెంట్ చేశాడా అనేది మాస్ మహారాజ్‌కే తెలియాలి.