English | Telugu

త‌మ‌న్నానా.. వ‌ద్దులే..!!

హీరోల ద‌యా దాక్షిణ్యాల మీదే .. హీరోయిన్లకు అవ‌కాశాలు వ‌స్తాయ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీ లేదు. టాలీవుడ్‌లో ఈ సంస్ర్కృతి మ‌రింత బలంగా నాటుకుపోయింది. పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఎంపిక పూర్తిగా హీరోగారి చేతుల్లోనే ఉంటుంది. ఆయ‌న ఎస్ అంటే అవ‌కాశం.. లేదంటే తిర‌స్కారం. ప్రస్తుతం త‌మ‌న్నా పెద్ద హీరోల దృష్టిలోంచి దాటుకుపోయింద‌న్నది లేటెస్ట్ టాక్‌. త‌మ‌న్నాకి పెద్ద సినిమాల్లో అవ‌కాశం త‌గ్గ‌డం వెనుక పెద్ద స్కెచ్చే ఉంద‌ని అర్ధమ‌వుతోంది. ప్రస్తుతం ఊపిరిలో న‌టిస్తోంది త‌మ‌న్నా. అది త‌ప్ప చేతిలో పెద్ద సినిమా ఏదీ లేదు. అందుకే స్పీడున్నోడులో ఓ ఐటెమ్ పాట చేయ‌డానికి ముందుకొచ్చింది. త‌మ‌న్నా టాలెంట్‌ని తక్కువ అంచ‌నా వేయ‌లేం. పైగా చూపు మ‌ర‌ల్చలేని గ్లామ‌ర్ ఆమెది. అయినా ఎందుకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి?

దానికి కార‌ణం హీరోలే అని టాక్‌. పెద్ద హీరోలు కావాల‌నే త‌మ‌న్నాని దూరం పెడుతున్నార‌ని తెలుస్తోంది. అందుకే బాహుబ‌లి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా ఆమెకు అవ‌కాశాలు అంద‌కుండా పోయాయి. త‌మ‌న్నా పేరు చెబితే...స్టార్ హీరోలు `సారీ` అంటున్నార‌ట‌. దానికి కార‌ణం.. సెట్లలోనూ, సినిమా ప్రమోష‌న్లలోనూ అడుగ‌డుగునా త‌మ‌న్నా డామినేట్ చేయ‌డ‌మే అని తెలుస్తోంది. పైగా త‌మ‌న్నా ఇండివిడ్యువాలిటీని హీరోలు స‌హించ‌లేక‌పోతున్నారని తెలుస్తోంది. హీరోల అడుగుల‌కు మ‌డుగులొత్తే స్వభావం కాక‌పోవ‌డంతో, స్టార్ హీరోలు కావాల‌నే త‌మ‌న్నాని దూరం పెడుతున్నారట‌. అందుకే త‌మ‌న్నాకు పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇండస్ట్రీ మొత్తం ఏడెనిమిది మంది క‌థానాయ‌కుల చుట్టూనే తిరుగుతోంది. ఆల్మోస్ట్ అంద‌రితోనూ న‌టించేసింది త‌మ‌న్నా. ఇప్పుడు వాళ్లే త‌మ‌న్నాని వ‌ద్దనుకొంటున్నారు. మ‌రి.. త‌మ‌న్నా వాళ్లంద‌రి మ‌న‌సుల్నీ మ‌ళ్లీ గెలుచుకొంటుందా? లేదంటే కొత్త హీరోల‌తో సర్దుకుపోతుందా? అనేది కాల‌మే చెప్పాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.