Read more!

English | Telugu

కాజల్ కు కళ్లు తెరుచుకున్నాయా..?

అందాల చందమామ కాజల్ కు గత కొన్నాళ్లుగా సినిమాలే లేవు. మగథీర తో ఫామ్ లోకి వచ్చి, వరసగా పెద్ద హీరోలందరితో జతకట్టి, గోల్డెన్ లెగ్ అనిపించుకున్నా, ఆ తర్వాత రెమ్యునరేషన్ పెంచడంతో ఒక్కసారిగా పాపకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఒకటి అరా సినిమాల్లో తప్ప కనిపించలేదు. దీంతో ఇప్పుడు కాజల్ కళ్లు తెరుచుకున్నాయి. రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడంతో పాటు అందాల ఆరబోతకు కూడా సై అంటూ సిగ్నల్స్ ఇచ్చేసింది. ఫిల్మ్ ఫేర్ లో తన అందాలను డ్రెస్ వేయడమే అందుకు ఎగ్జాంపుల్ అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.

కాస్ట్ కటింగ్ కలిసొచ్చిందో ఏమో గానీ, ఇప్పుడు ఒకేసారి సూపర్ స్టార్ బ్రహ్మోత్సవం, పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ తో పాటు, తమిళంలో మరో మూడు సినిమాలకు సైన్ చేసి, ఫామ్ లోకి వచ్చేసింది. రంగం ఫేమ్ జీవా తో ఒక మూవీ, విక్రమ్ తో ఒక మూవీ సైన్ చేయడంతో పాటు విజయ్ తో మూవీ చర్చల్లో ఉంది. బాలీవుడ్ లో రణ్ దీప్ హుడాతో చేసిన దో లఫ్జోంకి కహానీ కూడా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా, కాజల్ తిరిగి నెంబర్ వన్ స్పాట్ కు చేరిపోవడం ఖాయం..మరి కాజల్ అదృష్టం ఎలా ఉందో..!