Read more!

English | Telugu

రెస్ట్ తీసుకుంటున్న చిరు

మెగాస్టార్ చిరంజీవికి భుజానికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పటల్లో జరిగిన ఈ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. చాలా కాలం నుంచి వేధిస్తున్న భుజం నొప్పి, కత్తి షూటింగ్ లో తనను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే చిరంజీవి ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం, హాస్పటల్లోనే చిరు కోలుకుంటున్నారు. శనివారం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఫిబ్రవరి మార్చిల్లో కత్తి షూటింగ్ ను షురూ చేయాలని చిరు భావిస్తున్నట్లు సమాచారం.