English | Telugu

సూర్య 24 సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..?

సూర్య ట్రిపుల్ రోల్ చేసిన 24 మూవీ తెలుగు తమిళ ఇండస్ట్రీల్లో చాలా ఆసక్తిని కలిగిస్తోంది. మనం లాంటి సినిమా తర్వాత విక్రమ్ కే కుమార్ తీసిన సినిమా కావడం, సూర్య స్వయంగా సినిమా స్టోరీ నచ్చి నిర్మించాలనుకోవడం, ఇంట్రస్టింగ్ ట్రైలర్స్, రెహమాన్ మ్యూజిక్..ఇవన్నీ కలిసి సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి. సూర్య కెరీర్లో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో అతి భారీ బడ్జెట్ గా 24 తెరకెక్కింది. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా సూర్య సినిమా బడ్జెట్ 75 కోట్లు అని చెప్పడం విశేషం. ఈ శుక్రవారం తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న 24 పైనే సూర్య ఆశలన్నీ ఉన్నాయి. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ లేక డల్ గా సాగుతున్న సూర్య, తన కెరీర్ కు ఈ సినిమా మంచి పుష్ ఇస్తుందని భావిస్తున్నాడు. సినిమాకు కథ కారణంగానే ఇంత బడ్జెట్ అయిందని సమాచారం. కథ రీత్యా, రకరకాల టైమ్ జోన్స్ కు తగ్గట్టు సెట్ వేయడం కోసమే ఎక్కువ శాతం ఖర్చు పెట్టారట. సినిమా అవుట్ పుట్ పై సూర్య కూడా చాలా విశ్వాసంగా ఉన్నాడని మూవీ టీం చెబుతున్నారు. ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సమంత, నిత్యామీనన్ లు సూర్య సరసన రొమాన్స్ చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.