English | Telugu

సుప్రీంకు గ్యాంగ్ లీడర్ కు పోలికా..?

మెగా హీరోల్లో, చిరు పోలికలున్న ఏకైక హీరో సాయి ధరమ్ తేజ్. ఈ ఒక్క విషయంతో మెగాఫ్యాన్స్ ను కొట్టేశాడు తేజూ. కేవలం మావయ్య పోలికలే కాక, వీలైనప్పుడల్లా ఆయన పాటల్ని రీమిక్స్ చేసేస్తూ, చిరంజీవి ఇమేజ్ ను వీలైనంతగా వాడుకుంటున్నాడు. సుప్రీం హీరో అన్న ట్యాగ్ లైన్ తీసుకున్న సాయి ధరమ్, అదే టైటిల్ గా పటాస్ ఫేం అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేశాడు. మే 6 న రిలీజ్ కానున్న ఈ సినిమా తనకు స్టార్ స్టేటస్ ఇస్తుందని ఆశలు పెట్టుకున్నాడీ సుప్రీం హీరో. అయితే ఈ సినిమాపై ఫిల్మ్ నగర్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. చిరు గ్యాంగ్ లీడర్ సినిమానే కొద్దిగా మార్చి సుప్రీంగా తీశారని, ఎక్కువ శాతం ఆ సినిమాను ప్రేరణగా తీసుకుని తీసిందేనన్న రూమర్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని సాయి దగ్గర ప్రస్తావిస్తే, ఈ వార్తలు నాకూ తెలిశాయి. కానీ అవి పక్కా రూమర్స్ మాత్రమే. అందం హిందోళం అనే పాట తప్ప, ఈ సినిమాలో చిరంజీవి గారికి సంబంధించి ఇంకేమీ వాడుకోలేదు. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయద్దు. ఇప్పటికే నాకు చిరంజీవి గారితో చాలా కంపేరిజన్స్ చేస్తున్నారు అంటూ సమాధానమిస్తున్నాడు తేజూ. మెగాస్టార్ ఎంతో కష్టపడితే ఆ స్థాయికి చేరుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే సాయిధరమ్ తేజ్ భుజాల పైన ఆయన తాలూకు పోలికల బరువు పెట్టేస్తే, మోయడం కష్టమే మరి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.