English | Telugu

కబాలీ నిర్మాత కాన్ఫిడెన్స్ చూశారా..!

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలీ టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇది నిర్మాత కలైపులి ఎస్ థానుకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేసింది. పైగా కత్తి, తేరీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మీద కూడా ఉన్న ప్రొడ్యూసర్ కావడంతో డేరింగ్ చేస్తున్నాడు ఈ మెగా ప్రొడ్యూసర్. సూపర్ స్టార్ మీద, తన సినిమా మీద ఉన్న నమ్మకంతో రజనీ కెరీర్లోనే అత్యంత భారీ రిలీజ్ గా కబాలీని చేయబోతున్నామని, ఈ సినిమా టోటల్ 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని బల్ల గుద్ది చెబుతున్నాడు థాను. ఇంతేకాదండోయ్..సినిమాను చైనా, జపాన్ లతో పాటు ఆసియాలోని చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారట మూవీ టీం. రజనీకాంత్ కు జపాన్ తో పాటు ఆసియా దేశాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అందుకే కలైపులి ఇప్పుడు ఎక్కడలేని ధైర్యంతో రజనీ మీద నమ్మకంతో బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు. సినిమాకు హిట్ టాక్ వస్తే, రజనీ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసినా ఆశ్చర్యం లేదు మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.