English | Telugu

మ‌హేష్‌ని ప‌ట్టేస్తాడా.. ఏంటీ?

సురేంద‌ర్‌రెడ్డి మంచి టెక్నీషియ‌న్‌. క‌థ చెప్పే విధానం చాలా బాగుంటుంది. రివ‌ర్స్ స్ర్కీన్ ప్లేని స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకొన్న తెలుగు ద‌ర్శ‌కుడాయ‌న‌. కిక్‌, రేసుగుర్రంలాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. అయితే కిక్ 2తో సురేంద‌ర్‌రెడ్డి బాగా నిరాశ ప‌రిచాడు. ఆ సినిమాకి పెట్టుబ‌డి పెరిగిపోయింద‌ని కొంద‌రు, సురేంద‌ర్‌రెడ్డి మ‌న‌సు పెట్టి తీయ‌లేక‌పోయాడ‌ని మ‌రికొంద‌రు విమ‌ర్శించారు.

ఇది సురేంద‌ర్‌రెడ్డ‌డి సినిమానేనా అనే అనుమాన‌మూ వ‌చ్చింది. త‌దుప‌రి సినిమా చ‌ర‌ణ్‌తో క‌మిట‌య్యాడు కాబ‌ట్టి స‌రిపోయింది, లేదంటే బ‌డా స్టార్లు అంత తేలిగ్గా సూరికి అవ‌కాశాలు ఇచ్చేవాళ్లు కాదేమో. అయితే ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడి దృష్టి మ‌హేష్ బాబుపై ప‌డింది. మ‌హేష్‌తో బాండు టైపు క‌థ చేయాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు సురేంద‌ర్‌రెడ్డి.

బాండ్ సినిమాని చేయాల‌ని మ‌హేష్ ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నాడు. కృష్ణ కోరికా అదే. అందుకే ఆ దారిలో ఆలోచిస్తే మ‌హేష్ బుట్ట‌లో ప‌డిపోతాడ‌ని సురేంద‌ర్‌రెడ్డి ఫీల‌వుతున్నాడు. అది అంత ఈజీ కాదు. చ‌ర‌ణ్ సినిమాని రేసుగుర్రంలా హిట్ చేస్తే త‌ప్ప‌, మ‌హేష్ డేట్లిచ్చే ఛాన్సే లేదు. మ‌రి సూరి ఏం చేస్తాడో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.