English | Telugu

కొత్త ట్రెండ్..రామ్ చరణ్ ఐటెం సాంగ్

మెగాస్టార్ సినిమాలో మెగాస్టార్ మాత్రమే హీరో. మిగతావాళ్లంతా ఐటెమ్ లే అనేది తండ్రి గురించిన చెర్రీ అభిప్రాయం. డాడ్ అంటే చెర్రీకి ఎంత ప్రేమో ఇప్పుడర్థమైంది కదూ? అసలు ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది గురూ? అన్న ప్రశ్నకు.. ఈ సంవత్సరమే మొదలవుతుంది. 2016 వేసవినాటికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. నాన్నగారి సినిమాలో ఒకవేళ నటించాల్సొస్తే నేనో ఐటెమ్ నంబర్ ని మాత్రమే. ఇందులో కేవలం డాడ్ మాత్రమే నటిస్తారు. నేను డ్యాన్స్ చేస్తానంతే. ఒకవేళ మెగా ఫ్యామిలీ హీరోలంతా ఈ చిత్రంలో నటించాల్సొస్తే... పవన్ బాబాయ్ నేను బన్ని సాయిధరమ్ అందరూ ఐటెమ్ లే అంటూ ఛమత్కరించాడు చరణ్.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.