English | Telugu
సూపర్ స్టార్ డబ్బింగ్ పూర్తైపోయింది..!
Updated : Apr 24, 2016
సూపర్ స్టార్ రజనీ ఫుల్ జోరు మీదున్నాడు. వరసగా భారీ బడ్జెట్ ఫిలింస్ తో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. కబాలీ, రోబో లాంటి క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు రజనీ. విక్రమసింహ, లింగా లాంటి పరాజయాల తర్వాత సూపర్ స్టార్ కు సూపర్ హిట్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఆ లోటును కబాలీ తీరుస్తుందని రజనీ భావిస్తున్నాడు. కబాలీ కోసం కథపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న కబాలీకి రజనీ డబ్బింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాకు జస్ట్ ఐదు రోజుల్లోనే తన పాత్ర డబ్బింగ్ ను రజనీ కంప్లీట్ చేసేశారట. మరో వైపు రోబో 2.0 షూటింగ్ లోనూ పాల్గొంటూ హాట్ సమ్మర్ లో కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు సూపర్ స్టార్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కబాలీలో రజనీ సరసన రాథికా ఆప్టే నటిస్తోంది. మూవీ జూన్ మొదటి వారంలో రిలీజవుతుందని సమాచారం.