English | Telugu
పవన్ ఫిట్ నెస్ వెనుక ఉన్న సీక్రెట్ తెలుసా..?
Updated : Apr 24, 2016
ఫలితాలకు అతీతంగా పనిచేసుకుపోతుంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాన్ని నిరూపిస్తూ సర్దార్ గబ్బర్ సింగ్ కాస్త భిన్నమైన ఫలితాన్నిచ్చినా, వెంటనే ఎస్ జే సూర్య డైరెక్షన్లో తన తర్వాతి సినిమా పనుల్ని వేగవంతం చేశాడు. త్వరలోనే పాలిటిక్స్ లో కూడా పూర్తి స్థాయిలో ప్రవేశించి విస్తృత పర్యటనలు చేయబోతున్నాడు పవర్ స్టార్. మరి ఇంత బిజీ లైఫ్ ను గడిపే పవన్, ఫిట్ గా ఉండటం కోసం ఏం చేస్తాడు..? ఆరోగ్యం కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటాడు అనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా..? ఈ ప్రశ్నలకు ఒక ఇంటర్వ్యూలో సమాధానాలిచ్చాడు పవనుడు. సినిమాల్లోకి రాకముందు తన ఇంట్రస్ట్ తో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని, నేటికీ తాను ఫిట్ గా ఉండటానికి అవే ఉపయోగపడుతున్నాయని చెప్పాడు. ప్రతీ రోజూ తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేయడం పవన్ కు అలవాటట. అంతేకాక, తన ఫుడ్ లో కూడా పూర్తిగా శాకాహారమే ఉంటుందని, ఏడాదిలో ఆరు నెలల పాటు రోజుకు ఒక పూటే మీల్స్ తీసుకుని, మిగిలిన పూటల్లో ఫ్రూట్స్ తీసుకుంటుంటాడట. స్ట్రిక్ట్ ఫుడ్ డైట్, వ్యాయామం, యోగాతో పాటు, అనవసరమైన విషయాల మీద బుర్ర పెట్టకుండా తన పని తాను చేసుకుపోవడమే తన ఫిట్ నెస్ వెనుక ఉన్న ట్రైనింగ్ అంటున్నాడు పవర్ స్టార్. తెలిసిందిగా పవన్ ఫిట్ నెస్ సీక్రెట్..రేపటి నుంచీ మీరు కూడా అదే డైట్ ఫాలో అయిపోండి మరి..!