English | Telugu
షూటింగ్ పూర్తి చేసుకున్న నితిన్ త్రివిక్రమ్ సినిమా..!
Updated : Apr 24, 2016
నితిన్ సమంతల కాంబినేషన్లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా అ..ఆ నిన్నటితో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో ప్రకటించాడు నితిన్. అ..ఆ షూటింగ్ పూర్తైపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాలి. ఈ సినిమా టీం ను చాలా మిస్ అవుతాను అని ట్వీట్ చేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తీస్తున్న సినిమా కావడంతో, అఆ పై మంచి అంచనాలున్నాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ నెల 26న మూవీ ఆడియోను రిలీజ్ పెద్ద ఎత్తున్న ప్లాన్ చేశారు మూవీ టీం. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించిన అ..ఆ ను మే లో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.