English | Telugu
సూపర్‌స్టార్ రజనీకి షాక్..!
Updated : May 10, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు షాక్ తగిలింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న కబాలీ సినిమా వాయిదా పడింది. వరుస ప్లాప్‌ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో పాటు..గ్యాంగ్‌స్టార్‌గా ఆయన లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్‌లో భాషాలో కనిపించినంత స్టైలిష్ లుక్‌లో రజనీ కనిపించాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్టు జూన్ 3న కాకుండా జూలై 1న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.