English | Telugu
ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానంటున్న శ్రీమంతుడు..!
Updated : May 8, 2016
బుర్రిపాలెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు ప్రముఖ సినీనటుడు మహేశ్. బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సందర్భంగా ఆయన మొదటిసారి గ్రామానికి వచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్‌స్టార్ మాట్లాడారు. బుర్రిపాలెంకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజకుమారుడు చిత్రం సమయంలో ఈ గ్రామానికి వచ్చానని, మళ్లీ, ఇప్పుడు తన గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన నాయనమ్మ, నాన్న, బాబాయిలకు బుర్రిపాలెం అంటే చాలా ఇష్టమని, ఊరి కోసం వారు చాలా చేశారని..ఈ కార్యానికి వాళ్లే స్పూర్తే అన్నారు.
శ్రీమంతుడు సమయంలోనే బావ గల్లా జయదేవ్ ఈ గ్రామాన్ని తనను దత్తత తీసుకోమన్నారు. తాను చేస్తున్న చిత్రం కూడా దత్తత గ్రామం అనే అంశంతో ఉండటంతో, బుర్రిపాలెంను దత్తత తీసుకుంటే కనుక పబ్లిసిటీ కోసమని అందరూ అనుకుంటారని, ఈ చిత్రం విడుదలైన తర్వాత దత్తత తీసుకుంటానని చెప్పినని అన్నారు. గల్లా జయదేవ్ తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో చూశానని, చాలా ఇన్ స్పైరింగ్‌గా ఉందని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమంటే రోడ్లు, రంగులు వేయడం కాదని మహేశ్ వ్యాఖ్యానించారు. ఇకపై ఇక్కడకు మళ్లీ మళ్లీ వస్తానన్నారు.