English | Telugu
దటీజ్ శంకర్..గ్రాఫిక్స్ కోసమే వందకోట్లు..!
Updated : May 8, 2016
డైరెక్టర్ శంకర్. ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్‌ని ఇంటర్నేషనల్ రేంజ్‌కు తీసుకెళ్లిన డైరెక్టర్. శంకర్ అంటేనే భారీ తనం. ప్రతీ ఫ్రేమ్‌కు భారీగా ఖర్చు చేస్తూ సినిమాను భారీగా తియ్యడం ఒక్క శంకర్‌కు మాత్రమే సాధ్యం. సినిమాల్లో తాను పెట్టిన ప్రతి ఖర్చును కూడా స్క్రీన్ మీద కనిపించేలా చేస్తాడు శంకర్. అప్పట్లో సూపర్ స్టార్ రజనీతో తీసిన రోబోలో శంకర్ విజువల్ వండర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా రోబో-2 (2.0) తీస్తున్నాడు శంకర్. ఈ సినిమాను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ తీయని రేంజ్‌లో చూపించబోతున్నాడు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న సంగతే అని మీరు అనుకోవచ్చు. కాని అక్కడే వుంది లాజిక్. సౌతిండియన్ మూవీకి రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే నిర్మాతలు వామ్మో అంటున్న రోజుల్లో..ఏకంగా గ్రాఫిక్స్ కోసమే రూ.100 కోట్లు ఖర్చపెట్టిస్తున్నాడు శంకర్. శంకర్‌ను నమ్మి లైకా ప్రొడక్షన్స్ కూడా దీనికి ఏమాత్రం వెనుకాడటం లేదు. సో దటీజ్ శంకర్.