English | Telugu
మహేష్‌కు జోడి కుదిరింది..?
Updated : May 8, 2016
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమా ఆడియో లాంఛ్ అయిపోయింది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో తను చేయబోయే నెక్స్ట్ మూవీలపై ఫోకస్ చేశాడు మహేశ్. తమిళ స్టార్ డెరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు మహేశ్. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరు అంటూ రకరకాల రూమర్స్ చక్క్లర్లు కొట్టాయి. తెలుగు, తమిళ్‌లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడు మహీ. హీందిలో హిట్ కొట్టాలంటే అక్కడ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ కావాలి అందుకే బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా మహేశ్‌తో రోమాన్స్ చేయబోతుందని ప్రచారం జరిగింది. అయితే పరిణీతి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఆమెను పక్కన పెట్టారు. తాజాగా క్యూట్ హీరోయిన్ అలియా బట్ స్క్రీన్ మీదకు వచ్చింది. ఈ కుర్రదాన్ని ఆల్‌మోస్ట్ హీరోయిన్‌గా ఫిక్స్ చేశారన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తుంది. మరి అలియా కన్ఫామ్ అవుతుందా..? లేక మరో బ్యూటీ తెరపైకి వస్తుందా అనేది త్వరలో తేలిపోనుంది.