English | Telugu
మా అమ్మకి మదర్స్ డే విషెష్ చెప్పను: వర్మ
Updated : May 8, 2016
ఎప్పుడూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రామ్‌గోపాల్ వర్మ మాతృదినోత్సవం సందర్భంగా మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిఒక్కరూ వారి మాతృమూర్తులకు శుభాకాంక్షలు చెబుతూ తల్లులతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. కాని అందరికి భిన్నంగా ఆలోచించే వర్మ మాత్రం తన తల్లికి శుభాకాంక్షలు చెప్పనంటున్నాడు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. నేనో చెడ్డ కొడుకునని మా అమ్మ ఫీలింగ్. కానీ తను మాత్రం ఓ మంచి అమ్మ. మంచి తల్లి ఎప్పుడూ చెడ్డ కొడుకు శుభాకాంక్షలు కోరుకోదు. కాబట్టే నేను మదర్స్ డే విషెష్ చెప్పను అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.