English | Telugu
వెంకీ 75వ సినిమాకు డైరెక్టర్ ఎవరో తెలుసా..?
Updated : May 8, 2016
టాలీవుడ్‌లో సీనియర్లంతా మైల్ స్టోన్ మూవీస్‌తో బిజీగా బిజీగా ఉంటున్నారు. చిరంజీవి 150..బాలయ్య 100వ సినిమాలకు ఇప్పటికే కొబ్బరికాయ కొట్టేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి వెంకటేశ్ వచ్చారు. మూడు దశాబ్దాలుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు తెరపై క్లాస్ కమ్ మాస్ హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రజంట్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న బాబు బంగారం వెంకటేశ్ కెరీర్‌లో 73వ చిత్రం. ఈ సినిమా పూర్తయిన వెంటనే కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. వాటన్నింటి కంటే ముందు తన 75వ చిత్రంపై వెంకీ ఫోకస్ చేశాడు. ఈ సినిమాకు దర్శకుడు, స్క్రిప్ట్, నటీనటులు, టెక్నికల్ టీం విషయమై ఇప్పటి నుంచే భారీ కసరత్తు చేస్తున్నాడట. మొన్నామధ్య డైరెక్టర్ పూరీ చెప్పిన స్టోరీ లైన్ వెంకీకి బాగా నచ్చిందట. దీంతో వెంకీ తన 75వ సినిమాను పూరీకే అప్పగించాడని ఫిల్మ్ నగర్ టాక్.