English | Telugu
ఉగాది కానుకగా బ్రహ్మోత్సవం పోస్టర్
Updated : Apr 8, 2016
సూపర్‌స్టార్ మహేశ్-శ్రీకాంత్ అడ్డాల కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మోత్సవం. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ రిలీజైంది. ఉగాది కానుకగా ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెబుతూ బ్రహ్మోత్సవం టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్‌లో వైట్ కలర్ సూటు వేసుకున్న మహేశ్ ఎవరికో చెప్పులు తొడుగుతున్నట్టుగా ఉంది. దీంతో సూపర్‌స్టార్‌తో చెప్పులు తొడిగించుకేనే ఆ గొప్ప వ్యక్తి ఎవరబ్బా అని ప్రిన్స్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, తులసి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే.మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని ప్రసాద్ వి.పొట్లూరితో కలిసి మహేష్‌బాబు నిర్మిస్తున్నారు.