English | Telugu
సారీ చెప్పిన సన్నీ లియోన్
Updated : Jan 25, 2016
పాపం సన్నీలియోన్.. తన తప్పు లేకుండానే సారీ చెప్పింది. విషయమేంటంటే, బాలీవుడ్ లో సన్నీ లియోన్ పేరుకు అతి దగ్గరగా ఉండే మరో పేరు సన్నీ డియోల్. సన్నీ అనే మొదటిపేరుతో పాటు, లియోన్, డియోల్ పేర్లు కూడా దగ్గరగా ఉండటం నటుడు సన్నీ డియోల్ కు తలనొప్పిగా మారింది.. సన్నీలియోన్ పేరుతో పాటు డియోల్ ను కూడా కలిపేసి జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు. పాపం తన తప్పు లేకుండానే ఇలా జోకులకు టార్గెట్ గా మారిపోయాడు డియోల్.. దీంతో తన వల్లే అతనికి ఆ ఇబ్బంది వచ్చిందని, ఒక ఇంటర్వ్యూలో సారీ చెప్పింది సన్నీ." మీ మీద వస్తున్న భయంకరమైన, చిత్రాతిచిత్రమైన జోకులకు నేను చాలా బాధపడుతున్నాను.నావల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది..ఐయామ్ వెరీ సారీ " అంటూ నొచ్చుకుంది.సన్నీ లియోన్ ను ఎప్పుడూ ఒక యాంగిల్ లోనే ఆలోచించే ఆమె అభిమానులు, ఇప్పుడు తన తప్పు లేకుండానే క్షమాపణ అడిగిన మా సన్నీ ఎంత మంచిదో అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.సన్నీ నటించిన అడల్ట్ కామెడీ, మస్తీజాదే జనవరి 29 న థియేటర్లలో సందడి చేయనుంది..