English | Telugu
బాహుబలి నటులకు ఎం.జి.ఆర్ & శివాజీ ఫిల్మ్ అవార్డ్స్
Updated : Jan 25, 2016
ఒకే ఒక్క సినిమా తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. సౌత్ ఇండియన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసి ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలిచి అందరి చేత ప్రశంసలు అందుకుంది. అది ఏ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాహుబలి.. 2015 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా సృష్టించిన హైప్ అంతా ఇంతా కాదు. దానికి తగ్గట్టే ఈ సినిమాకి రావాల్సి కలెక్షన్స్.. పేరు వచ్చేశాయి. ఇక అవార్డ్ విషయంలోకి వస్తే ఇటీవలే ఈ సినిమాలో భళ్లాలదేవగా నటించిన రానాకి ఆసియా విజన్ మూవీ అవార్డ్ గెలుచుకున్నాడు. రానాతో పాటు ఇంకా ఈసినిమాలో నటించిన సత్యరాజ్ కు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అయిన శ్రీనివాస్ మోహన్ లు కూడా అవార్డులు దక్కాయి. తమిళనాడు ప్రతి ఏడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఎం.జి.ఆర్ & శివాజీ ఫిల్మ్ అవార్డ్స్’ వీరిద్దరికి దక్కాయి.