English | Telugu

ఎంఎస్ నారాయణ సతీమణి కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు, దివంగత ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) కన్నుమూశారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆమె గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా కళాప్రపూర్ణ గుండె సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. ఎంఎస్ నారాయణ 2015 జనవరి 23న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. భర్త ప్రథమ వర్థంతి జరిగిన రెండు రోజులకే కళాప్రపూర్ణ మృతి చెందారు. ఏడాది వ్యవధిలోనే వారి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది.

ఎంఎస్ నారాయణ భీమవరంలో మూర్తి రాజు కాలేజీలో భాషాప్రవీణ కోర్చు చదువుతున్నప్పుడు తన తోటి విద్యార్ధిని కళాప్రపూర్ణతో ప్రేమలో పడ్డారు. కానీ ఎమ్మెస్ కులాంతర వివాహానికి ఆయన కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు.దాంతో అదే కాలేజీలో అధ్యాపకునిగా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ సహకారంతో,కళాప్రపూర్ణను,1972లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ఎమ్మెస్ నారాయణ మూర్తిరాజు హైస్కూల్లో,ఆయన భార్య జూపూడి కేశవరావు హైస్కూల్లో సెకండరీ గ్రేడ్ తెలుగు పండిట్‌గా పనిచేశారు.కాగా,పలువురు సినీప్రముఖులు, కళాప్రపూర్ణ మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .