English | Telugu

సునీల్ హీరోగా చిత్రాలు

సునీల్ హీరోగా చిత్రాలు బాగానే రానున్నాయి. వివరాల్లోకి వెళితే హిందీలో సూపర్ హిట్టయిన "తను వెడ్స్ మను" చిత్రాన్ని తెలుగులో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సునీల్ హీరోగా, దేవీ ప్రసాద్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. దీని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో, సునీల్ హీరోగా "సంబరాల రాంబాబు" అనే పేరుతో ఒక చిత్రం రూపుదిద్దుకోనుంది.

తమిళ చిత్రం "వేట్టై" తెలుగు రీమేక్ లో నాగచైతన్యతో పాటు సునీల్ కూడా హీరోగా నటిస్తున్నాడు. అలాగే "నెపోలియన్" అనే చిత్రంలోనూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్న "బంతి" అనే చిత్రంలోనూ సిక్స్ ప్యాక్ రాయల్ హీరో సునీల్ నటించటానికి అంగీకరించాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.