English | Telugu
దేవిశ్రీ నిజమైన స్నేహితుడు సుకుమారే
Updated : Oct 31, 2019
రామ్‌చరణ్ 'రంగస్థలం' తర్వాత దేవిశ్రీ ప్రసాద్ నుండి సరైన హిట్ ఆల్బమ్ రాలేదు. మహేష్‌బాబు 'మహర్షి'లో పాటలు సినిమా విడుదల తర్వాతే హిట్టయ్యాయి. 'ఎఫ్ 2' హిట్టయ్యినా, అందులో పాటలపై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో దేవిశ్రీ దగ్గరకు వచ్చే పెద్ద దర్శకులు తగ్గారు. 'సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత దేవిశ్రీకి త్రివిక్రమ్ అవకాశం ఇవ్వలేదు. అలాగే, ఎప్పుడూ దేవిశ్రీతో పని చేసే కొరటాల శివ, చిరంజీవి సినిమా కోసం ఇతర సంగీత దర్శకుల వైపు చూస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోలు అందరికీ దేవిశ్రీ ప్రసాద్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. అయితే మహేష్ తప్ప మరొక స్టార్ హీరో అతడికి వరుసగా అవకాశాలు ఇవ్వడం లేదు.
దాంతో దేవిశ్రీ ప్రసాద్ పని అయ్యిపోయిందా? అనే విమర్శలు వినిపించాయి. అతడి హవా ఇండస్ట్రీలో తగ్గుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దేవిశ్రీకి నిజమైన స్నేహితుడు అనిపించుకున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ హీరోగా 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత తీస్తున్న సినిమాకు దేవీశ్రీని సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. ఓపెనింగ్ రోజున సినిమా సంగీత దర్శకుణ్ణి అనౌన్స్ చేశాడు. ఓపెనింగ్ కి పిలిచాడు. అల్లు అర్జున్-దేవిశ్రీ, సుకుమార్-దేవిశ్రీ, అల్లు అర్జున్-సుకుమార్-దేవిశ్రీ... మూడు మ్యూజికల్ హిట్ కంబినేషన్స్. 'సరిలేరు నీకెవ్వరు'తో పాటు ఈ సినిమా పాటలు హిట్టయ్యితే దేవిశ్రీ మరింత ఎత్తుకు వెళతాడు.