English | Telugu

అకీరాతో ‘ఓజీ2’.. పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్‌ చెప్పిన సుజిత్‌!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరానందన్‌ హీరోగా ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే దీని గురించి అడిగిన ప్రతిసారీ తల్లి రేణుదేశాయ్‌ విషయాన్ని దాటవేస్తూనే ఉన్నారు. తాజాగా పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్‌ మూవీ ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందనే హింట్‌ కూడా ఇచ్చారు. అయితే ఇది ఎలా ఉండబోతోంది అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. మరో పక్క ఓజీ2ని అకీరాతో చేసేందుకు సుజిత్‌ ప్లాన్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఓజీ2ని అకీరాతో చేయబోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు సుజిత్‌ సమాధానమిస్తూ.. ‘ఓజీ సినిమా సెట్స్‌కు అకీరా వచ్చాడు. అతనిలో నాకు మంచి స్పార్క్‌ కనిపించింది. ఓజీ2ని అకీరాతో చెయ్యాలా వద్దా అనేది మీరు పవన్‌కళ్యాణ్‌గారినే అడిగితే బాగుంటుంది. చెయ్యమంటే నేను ఒప్పుకుంటాను. అతనిలో ఒక వైబ్‌ ఉంది. ఇంతకుమించి నేను మాట్లాడడం కరెక్ట్‌ కాదు. ఇంకా ఏమైనా మాట్లాడితే అది చాలా దూరం వెళ్లిపోతుంది. కాబట్టి ఈ టాపిక్‌ను ఇక్కడితో ఆపేస్తున్నాను’ అంటూ క్లారిటీ ఇచ్చారు. సుజిత్‌ మాటలను బట్టి ఓజీ2 అకీరాతో చెయ్యాలనే ఆలోచన ఉందనే విషయం అర్థమవుతుంది. ఈ న్యూస్‌ వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ రచ్చ మొదలెట్టారు. అకీరా సినిమాల్లోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు సుజిత్‌ మాటలు విన్న తర్వాత ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. అకీరా ఎంట్రీ గురించి అధికారిక సమాచారం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.