English | Telugu

ఆడు మహేష్ బామ్మర్దిరా బుజ్జీ

తాను సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణకు సొంత అల్లుడ్నని.. సుపర్‌స్టార్ మహేష్‌బాబుకు స్వయాన బావమరిదినన్న విషయం ప్రపంచం మొత్తం తెలియాలని తెగ తపనపడిపోతుంటాడు సుధీర్‌బాబు. తను నటించే తదుపరి చిత్రానికి "ఆడు మగాడ్రా బుజ్జీ" అనే టైటిల్ ఏరికోరి పెట్టించుకొన్న సుధీర్‌బాబు.. తాజాగా తన కోసం "మాయదారి మల్లిగాడు" అనే మరో టైటిల్ రిజిష్టర్ చేయించుకొన్నాడు.

"అతడు" సినిమాలో ఓ ఫైట్ సీన్ అనంతరం బ్రహ్మాజీతో తనికెళ్లభరణి "ఆడు మగాడ్రా బుజ్జీ" అని చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. ఆ పాపులర్ డైలాగ్‌ని తన సినిమా టైటిల్‌గా పెట్టించుకొన్న సుధీర్‌బాబు.. ఇప్పుడు తన మావగారు నటించగా ఘన విజయం సాధించిన "మాయదారి మల్లిగాడు" చిత్రం టైటిల్‌ను వాడుకోబోతున్నాడు. సుధీర్‌బాబు తాజా చిత్రం "ప్రేమకథా చిత్రమ్" కోసం కృష్ణ నటించిన "పచ్చని సంసారం" చిత్రంలోని "వెన్నెలైనా.. వేకువైనా" అనే పాటను రీమిక్స్ చేయడం కూడా తెలిసిందే.

సుధీర్‌బాబును చూసి.. "ఆడు మహేష్ బామ్మర్దిరా బుజ్జీ" అని అఖిలాంధ్ర ప్రేక్షకులు అనుకొనేంతవరకు సుధీర్‌బాబు విశ్రమించేట్లు లేడు!