English | Telugu
ఎవడిది బాధ్యత?
Updated : Jun 21, 2013
రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఎవడు". అమీ జాక్సన్, శృతిహాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు.
ఒకరి బాధ్యతల్ని మరొకరు బాధ్యతగా స్వీకరిస్తే? ఒకరి ఫీలింగ్స్ మరొకరు షేర్ చేసుకుంటే? ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణే ఈ "ఎవడు" ఇంతకి ఎవరా ఇద్దరు వ్యక్తులు? వారి భాద్యతలేంటి? వారి మధ్య సంఘర్షణలేంటి? అనే "ఎవడు" చిత్ర కథాంశం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఈ నెల చివరి వారంలో, సినిమాను వచ్చే నెల 24లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.