English | Telugu
అమ్మతో ఫస్ట్ సెల్ఫీ దిగిన సరైనోడు
Updated : May 8, 2016
మదర్స్ డే సందర్భంగా చాలా మంది స్టార్స్ వాళ్ల అమ్మతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఆ రూట్లోనే ఫోటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. అల్లు అర్జున్ అమ్మగారి పేరు నిర్మల అల్లు. ఫ్యామిలీ ఫంక్షన్లకు తప్పిస్తే సాధారణంగా మీడియాకు దూరంగానే ఉంటారు . అందుకే తన తల్లితో పాటు సెల్ఫీ దిగి పోస్ట్ చేశాడు. పైగా మా అమ్మతో ఇది నా ఫస్ట్ సెల్ఫీ. మా అమ్మతో పాటు అమ్మలందరికి హ్యాపి మదర్స్ డే అంటూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్.