English | Telugu

వివాదంలో స్టార్ హీరోయిన్.. మొత్తం ఆమే చేసిందా..?

మనిషికి ఆశ ఉండొచ్చు కానీ, దురాశ ఉండకూడదు. ఇప్పుడు ఆ దురాశే ఓ ప్రముఖ హీరోయిన్ కి శాపంగా మారింది అంటున్నారు. బాలీవుడ్ కి చెందిన ఒకరు.. ఓ ఫేమస్ హీరోయిన్ ని టార్గెట్ చేస్తూ, తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. "ఒక ఫేమస్ పర్సన్ వల్ల కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతున్నాను. ఆమె టీమ్ మెంబర్స్ మరియు కుటుంబసభ్యులు స్టుపిడ్ గా, అన్ ప్రొఫెషనల్ గా ఉంటారు. సౌత్ ఇండియన్ టీమ్ ఫ్రీగానో లేదా తక్కువ బడ్జెట్ లోనో వర్క్ చేస్తే.. మాతోనూ అలాగే చేయించుకోవాలని చూస్తారు. ఫ్యామిలీలో ఒకరు ఇరిటేట్ చేస్తుంటే, మరొకరు సారీ చెప్తున్నారు. నాకు మీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు. మీరు టీమ్ కి ఇవ్వాల్సిన పేమెంట్స్ చెల్లించకపోతే.. మీ పేర్లు బయటపెడతాను" అంటూ ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్ట్ చూసి.. ఇది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కి సంబంధించిన వివాదమని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని, స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగిన ఆమె.. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆ హీరోయిన్ విషయంలో అన్నీ వెనకుండి చూసుకునేది ఆమె తల్లే అంటారు. సినిమాల ఎంపిక, రెమ్యూనరేషన్ ఇలా ప్రతి విషయంలో మదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెబుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ వివాదానికి కూడా హీరోయిన్ మదరే కారణమని టాక్. మేకప్ టీమ్ ని తాము పెట్టుకుంటామని చెప్పి, ప్రొడ్యూసర్స్ నుంచి ఎక్కువ మొత్తం తీసుకొని.. ఆ టీమ్ కి మాత్రం సరిగా పేమెంట్స్ ఇవ్వట్లేదని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాల్సి ఉంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.