English | Telugu

శ్రియ రిస్క్ వ‌ర్క‌వుట‌వుద్దా?

ఫిట్‌నెస్ కి ప‌ర్యాయ‌ప‌దంలా నిలిచే అందం ఢిల్లీ డాళ్ శ్రియ సొంతం. ఈ జ‌న‌రేష‌న్ హీరోయిన్ల‌లో లాంగ్ ర‌న్ మెయిన్‌టెయిన్ చేసిన వారిలో ఈ సొగ‌సిరిదే ప్ర‌థ‌మ స్థానం. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, ఇంగ్లీష్‌.. ఇలా లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా మ‌ల్టీలాంగ్వేజెస్‌లో త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది ఈ నాజూకూ సుంద‌రి. అయితే.. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విజయాల‌ను సొంతం చేసుకున్న ఈ 30 ప్ల‌స్ సొగ‌సు బాలీవుడ్‌లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు హిట్ కొట్ట‌లేక‌పోయింది. షుక్రియా, తుఝే మేరీ క‌స‌మ్‌, తోడా తుమ్ బ‌ద‌లే తోడా హ‌మ్‌, ఏక్‌, ఆవారాప‌న్‌.. ఇలా చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో సినిమాలు చేసినా శ్రియ‌కి నిరాశే ఎదురైంది. వీటిలో ఆవారాప‌న్ మ్యూజిక‌ల్‌గా సెన్సేష‌న్ అయినా.. హిట్ లిస్ట్‌లోకి చేర‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో శ్రియ రిస్క్ తీసుకుని ఓ టీనేజ్ గ‌ర్ల్‌కి అమ్మ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది త‌న తాజా హిందీ సినిమాలో. ఆ సినిమానే దృశ్యం. మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో రూపొంది హిట్ అయిన ఈ సినిమా హిందీలోనూ హిట్ కావ‌డం ఖాయం అని.. త‌న‌ను ఇన్నాళ్లుగా ఊరిస్తున్న విజ‌యం దృశ్యం రీమేక్‌తో ల‌భిస్తుంద‌ని శ్రియ చెప్పుకొస్తోంది. అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమా జులై 31న రిలీజ్ కానుంది.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.