English | Telugu

తాప్సీ న‌యా టార్గెట్‌

దెయ్యం ప‌ట్టిన పిల్ల‌గా గంగ సినిమాలో సంద‌డి చేసి అల‌రించింది ఉంగ‌రాల జుట్టు చిన్న‌ది తాప్సీ. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ కిక్‌తో ఇప్పుడు త‌న‌ జోరును పెంచే ప‌నిలో ప‌డింది ఈ ఢిల్లీ బ్యూటీ. ఆ జోరుని తెలుగు, త‌మిళం, హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లోనే కాకుండా ఇప్ప‌టివ‌ర‌కు తాను న‌టించ‌ని క‌న్న‌డ సీమ‌లోనూ చూపించేందుకు సిద్ధ‌మైంది ఈ అమ్మ‌డు. శాండిల్‌వుడ్‌లో ఇంత‌వ‌ర‌కూ ఒక్క సినిమా కూడా చేయ‌ని ఈ క‌ర్లింగ్ హెయిర్ బ్యూటీ.. రాజా రాణి పేరుతో రూపొంద‌నున్న ఓ క‌న్న‌డ చిత్రం కోసం సంత‌కాలు చేసేసింద‌ని అక్క‌డి వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి. చేత‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి నాగ శేఖ‌ర్‌ ద‌ర్శ‌కుడు. మ‌రి తాప్సీ న‌యా టార్గెట్ అయిన శాండిల్‌వుడ్‌లో ఆరంభం అదుర్స్ అనిపిస్తుందో లేదో చూడాలి?

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.