English | Telugu

వీడియో: 'శ్రీమంతుడు' గర్ల్స్ కొట్టుకుంటున్నారు

శ్రీమంతుడు థియేటర్లన్నీ హౌస్ ఫుల్. బాహుబలి తర్వాత అంత క్రేజ్ ప్రాజెక్టుగా ఈ సినిమా థియేటర్ల లో సందడి చేయబోతోంది. ఇక మహేష్ కి వున్న లేడీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. శ్రీమంతుడి సినిమా కోసం వీరు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శ్రీమంతుడు మార్నింగ్ బెనిఫిట్ షో టికెట్లన్ని సగం అమ్మాయిలే దక్కించుకున్నార౦టే, వారు ఈ శ్రీమంతుడి కోసం ఎంతగా ఎదురుచుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓ అమ్మాయి శ్రీమంతుడిని తెగ పోగిడేస్తోంది. ఆ అమ్మాయి శ్రీమంతుడి గురించి ఏం అంటుందో మీరే చూడండీ..!!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.