English | Telugu

'శ్రీ‌మంతుడు' బజ్ అదిరింది..మరి సినిమా!!

సూపర్ స్టార్ శ్రీమంతుడు సినిమా రిలీజ్ ఇంకా ఇరవై నాలుగు గంటలే వుంది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ మొత్తం పాజిటివ్ బజ్ నడుస్తుండడం విశేషం. బాహుబలి లాంటి సినిమాకి కూడా రిలీజ్ ముందు నెగిటివ్ టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. సాధారణంగా టాలీవుడ్ లో సినిమాలపై ఒకరు హిట్ అంటే మరొకరు ఫ్లాప్ అనడం ఎక్కువగా చూస్తుంటాం.కానీ శ్రీమంతుడు విషయంలో అంతటా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది.

సెన్సార్ దగ్గర నుంచి పాజిటివ్ టాక్ రప్పించుకున్న శ్రీమంతుడు..రెండు గంటల నలభై మూడు నిమిషాల పాటు అభిమానులను అలరించబోతున్నాడట. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్,హైప్, ఇతరత్రా వ్యవహారాలను దృష్టిలో వుంచుకుని, 80 కోట్లకు అటు ఇటుగా ఈ సినిమా హక్కులు ఈరోస్ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందంతా శ్రీ‌మంతుడి బిజినెస్ మ్యాజిక్‌. ఈ బజ్ ఏ మేరకు వాస్తవమో కొద్ది గంటల్లో జనాలే చెబుతారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.