English | Telugu
లగ్జరీ కారుని సొంతం చేసుకున్న కోర్ట్ మూవీ జాబిలి
Updated : Jul 16, 2025
నాచురల్ స్టార్ 'నాని'(Nani)నిర్మాతగా ప్రియదర్శి(Priyadarshi)ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ 'కోర్ట్'(Court). మార్చి 14 న విడుదలైన ఈ మూవీ ద్వారా తెలుగు తెరకి పరిచయమైన యువనటి 'శ్రీదేవి'. జాబిలి అనే పాత్రలో శ్రీదేవి నటన ప్రతి ఒక్కర్ని ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు చిత్ర విజయానికి కూడా దోహద పడిందని చెప్పవచ్చు.
రీసెంట్ గా శ్రీదేవి లగ్జరీ 'ఎంజీ కారు'(Mg Car)ని కొనుగోలు చేసింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన శ్రీదేవి 'కారు కొనడం నా కల, ఎట్టకేలకు నేరవేరిందంటూ పోస్ట్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి కారుతో దిగిన ఫోటీలని కూడా షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకి కంగ్రాట్స్ చెప్తున్నారు.
శ్రీదేవి ప్రస్తుతం ఒక తమిళ చిత్రానికి ఓకే చెప్పినట్టుగా సమాచారం. పలు తెలుగు చిత్రాల్లో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది.