English | Telugu
శ్రీ జగద్గురు ఆదిశంకర ప్రారంభం
Updated : Apr 5, 2011
ఈ "శ్రీ జగద్గురు ఆదిశంకర" చిత్రంలో టైటిల్ రోల్ ను కౌశిక్ ధరిస్తున్నారు.ఈ "శ్రీ జగద్గురు ఆదిశంకర" చిత్రంలో ఇంకా రియల్ స్టార్ శ్రీహరి, సుమన్, సాయికుమార్, ఆలీ, జె.డి.చక్రవర్తి, మురళీ మోహన్, గిరీష్ కర్నాడ్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, మీనా, జయప్రద తదితరులు నటిస్తున్నారు. ఈ "శ్రీ జగద్గురు ఆదిశంకర" చిత్రాన్నికేరళ, కాశీ, ప్రయాగ, మధుర, కేదారనాథ్, శ్రీకాళహస్తి, కొల్లూరు వంటి ప్రదేశాల్లో చిత్రీకరిస్తారు. ఈ "శ్రీ జగద్గురు ఆదిశంకర" చిత్రానికి నాగ్ శ్రీవత్స సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ "శ్రీ జగద్గురు ఆదిశంకర" చిత్రం ప్రారంభోత్సవానికి రామానాయుడు, పరుచూరి బ్రదర్స్, కె.సి.శేఖర్ బాబు వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు.