English | Telugu

సోలో బాయ్ మూవీ రివ్యూ 

సినిమా పేరు: సోలో బాయ్
తారాగణం: గౌతమ్ కృష్ణ, రమ్య పసుపులేటి, శ్వేతా అవస్తి, షఫీ, పోసాని కృష్ణమురళి, అనిత చౌదరి, భద్రం, చక్రపాణి తదితరులు
సంగీతం: జుడా సందే
డీఓపీ: త్రిలోక్ సుద్దు
ఎడిటర్: ప్రవీణ్ పూడి
దర్శకత్వం: నవీన్ కుమార్
ప్రొడ్యూసర్: సెవెన్ హిల్స్ సతీష్
బ్యానర్: సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: జూలై 4, 2025

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ(Gautham Krishna)హీరోగా, రమ్య పసుపులేటి(Ramya Pasupuleti), శ్వేతా అవస్తి(shweta avasthi)హీరోయిన్లుగా నటించిన చిత్రం సోలో బాయ్(Solo Boy). టైటిల్ తోనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ (గౌతమ్ కృష్ణ) ఒక కాలేజీలో ఉన్నత విద్య కోసం జాయిన్ అవుతాడు. ఆ టైంలో ప్రియ( రమ్య పసుపులేటి), కృష్ణ ఒకరికొకరు ప్రేమించుకుంటారు. కానీ డబ్బు సమస్య కారణంగా కృష్ణ నుంచి రమ్య విడిపోతుంది. ఆ బాధని దిగమింగుకున్న కృష్ణ ఒక ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత శృతి(శ్వేతా అవస్తి) తో ప్రేమలో పడతాడు. శృతి కి కూడా కృష్ణ ని ప్రేమించడంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత శృతి కూడా డబ్బు సమస్య కారణంగా కృష్ణ ని వదిలిపెడుతుంది. ప్రియ,శృతి డబ్బు కారణంతో కృష్ణకి దూరం కావడానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటి?. ఆ టైం లో కృష్ణ మానసిక పరిస్థితి ఏంటి? డబ్బు సమస్యల నుండి కృష్ణ బయటపడ్డాడా? ప్రియ, శృతి విషయంలో కృష ఏం చేసాడు? అసలు ఆ ఇద్దరి సమస్యలు కేవలం డబ్బు సంబంధితమైనవేనా? లేక మరిదైనా కారణం ఉందా? కృష్ణ ఆర్థికంగా స్థిరపడతాడా? ప్రియ, శృతి మళ్ళీ కృష్ణ జీవితంలోకి తిరిగి వస్తారా? చివరికి కృష్ణ కథ లైఫ్ ఎటు వైపు వెళ్లిందనేదే ఈ చిత్ర కథ

ఎనాలసిస్
ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రస్తుత యువతరానికి మంచి మెసేజ్ ని ఇచ్చే చిత్రంగా 'సోలో బాయ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విషయంలో చిత్ర దర్శక నిర్మాతలని ప్రత్యేకంగా అభినందించాలి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కాలేజీ సన్నివేశాలతో పాటు, హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగానే అలరించాయి.డబ్బు సమస్య వల్ల హీరో హీరోయిన్ విడిపోతున్నారు కాబట్టి, అందుకు సంబంధించిన సన్నివేశాల్లో మరింత బలం ఉండాల్సింది. హీరో ఫ్యామిలీ సీన్స్ మాత్రం బాగున్నాయి. కథ ఏంటో ముందుగానే చెప్పేశాం కాబట్టి కధనాలు మరింత గ్రిప్ గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో కూడా డబ్బు సమస్యనే హీరో తో పాటు మరో హీరోయిన్ మధ్య చూపించడం బాగుంది. కాకపోతే ఈ విషయంలో కూడా ఆ ఇద్దరు విడిపోవడాన్ని మరింత గ్రిప్ గా చూపించాల్సింది. పైగా సంభాషణలు కూడా అంత బలంగా లేవు. క్లైమాక్స్ మాత్రం బాగుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
కృష్ణ క్యారక్టర్ లో గౌతమ్ కృష్ణ అద్భుతంగా నటించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో అయితే మెస్మరైజ్ చేసాడని చెప్పవచ్చు. ప్రియ పాత్రలో రమ్యా పసుపులేటి తక్కువ స్క్రీన్ టైమ్‌లోనూ తన నటనతో ముద్ర వేస్తుంది. శ్వేతా అవస్తి కూడా తన పరిధిలో బాగానే చేసి తన క్యారక్టర్ కి నిండు తనాన్ని తెచ్చింది. పోసాని, అనితా చౌదరి కూడా పోటాపోటీగా నటించారు.మిగతా క్యారెక్టర్స్ లో చేసిన భద్రం, షఫీ, చక్రపాణి వంటి నటులు కూడా అద్భుతంగా నటించారు. దర్శకుడు నవీన్ కుమార్(P. Naveenkumar)మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కథను ఎంచుకొని, దాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించాడు. త్రిలోక్ సుద్దు సినిమాటోగ్రఫీ,పగలు, రాత్రి సన్నివేశాలకు అనుగుణంగా బ్యాక్‌గ్రౌండ్ డిజైన్‌తో మూవీకి సరికొత్త లుక్ ని తీసుకొచ్చింది. మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టుగా ఉండి సన్నివేశాలను మెరుగుపరిచాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కథను పదునుగా ఉంచింది. నిర్మాత సతీష్ ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఉన్నత ప్రమాణాలతో నిర్మించారు.

ఫైనల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సమాజంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండండనే సందేశాన్ని 'సోలోబాయ్' చిత్రం ఇచ్చింది

రేటింగ్: 2.5 /5

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.