English | Telugu
'స్కంద' ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్ ట్విస్ట్ కి పూనకాలే!
Updated : Sep 23, 2023
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్కంద'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో పాటు, రామ్-బోయపాటి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో.. 'స్కంద'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా అవుట్ పుట్ అదిరిపోయిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మునుపెన్నడూ చూడని క్లైమాక్స్ చూడబోతున్నామని, అది సినిమాకే హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.
బోయపాటి సినిమాల్లో మాస్ ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్స్ కూడా ఉంటాయి. 'స్కంద' విషయంలో కూడా బోయపాటి అదే ఫార్ములా ఫాలో అయ్యారట. అయితే గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఎమోషన్స్ కి పెద్దపీట వేశారట. రెండు కుటుంబాల కోసం హీరో పడే తపన కట్టిపడేసేలా ఉంటుందట. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది అంటున్నారు. స్కంద క్లైమాక్స్ గురించి చాలారోజుల పాటు మాట్లాడుకోవడం ఖాయమని చెబుతున్నారు.