English | Telugu
సునీత గాత్రానికి 28 ఏళ్ళు.. త్వరలోనే కొత్త ప్రయాణం!
Updated : Nov 5, 2023
సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సునీత అనగానే ముందుగా ఎవ్వరికైనా సరే 90 స్ వాళ్లకు గుర్తొచ్చే పాట గులాబీ చిత్రంలోని "ఈ వేళలో నీవు". ఈ పాట అప్పటికి ఇప్పటికీ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. ప్రేమికులంటే ప్రపంచాన్ని మర్చిపోయి ఇలా ఉండాలి అన్న ఒక క్రేజ్ ని కలిగించిన మూవీ ఇది. ఇక అందులో జేడీ చక్రవర్తి, మహేశ్వరి నటన అప్పటి యూత్ ని మత్తులో ముంచేసిందని చెప్పొచ్చు.
రేడియో ఆన్ చేసినా, టీవీ పెట్టినా, బరాతుల్లో ఆ పాటే ఎక్కువగా వినిపించేది. సునీత కూడా ఆ పాటను ఎంతో తన్మయత్వంతో పాడి ప్రాణం పోశారు. ఆ సాంగ్ లో లైవ్లీనెస్ ఉంటుంది ఇప్పటికి విన్నా కూడా. ఈ సాంగ్ మాత్రమే కాదు ఎన్నో అద్భుతమైన పాటలతో మన మనసులు దోచుకుందామె.
సునీత కమర్షియల్ సింగింగ్ కెరీర్ 1995లో గులాబీ మూవీతోనే స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఇక సునీత గాత్రానికి 28 ఏళ్ళు అంటూ చెప్పకనే చెప్పింది. ఈ గులాబీ మూవీ పోస్టర్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సునీత.
సింగర్ సునీతకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే సింగర్ సునీత ఓటీటీ సంస్థను స్టార్ట్ చేయబోతున్నట్లు అందులో దిల్ రాజు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. టాలీవుడ్ నిర్మాతగా ఎన్నో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు దిల్ రాజు. మరి ఇప్పుడు ఆయనతో కలిసి సునీత ఓటీటీ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది.