English | Telugu
ఎన్టీఆర్ కు మళ్ళీ కథ చెప్పిన వంశీ
Updated : Mar 7, 2015
వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ టెంపర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు రెండు ఫ్లాప్ కథలు అందించిన వక్కంతం వంశీ కూడా ఎన్టీఆర్ హిట్ స్టొరీ అందించిన జాబితాలో చేరిపోయాడు. ఎన్టీఆర్ కి హిట్ స్టొరీని అందించిన ఉత్సాహంలో వున్న వక్కంతం వంశీ మరో స్టొరీ లైన్ ను తారక్ కు వినిపించాడట. ఈ లైన్ నచ్చిన ఎన్టీఆర్ దీన్ని పూర్తిగా డెవలప్ చేయమని సూచించాడట. ఎన్టీఆర్ ఇప్పటివరకూ చేయని, చూడని పాత్ర ఈ స్టోరీలో ఉంటుందంటున్నారు. ఈ కథపై వంశీ మాట్లాడుతూ.. ప్రస్తుతం కథ చాలా ప్రాధమిక దశలో ఉందని, ఈ కథపై కసరత్తు చేయాల్సింది చాలానే ఉందని, మరికొంత సమయం పడుతుందని.. అప్పటివరకూ దీనిపై మాట్లాడలేనని చెబుతున్నారు.