English | Telugu
షారుఖ్‌ఖాన్ కొత్త రికార్డు
Updated : Jun 18, 2014
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తన స్టార్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరో సారి నిరూపించాడు. ట్విట్టర్ లో 80 లక్షల మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుని రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మధ్య షారుఖ్ ప్రపంచంలో సంపన్న నటుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అలాగే ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన పోల్ లోను ఆయనే బెస్ట్ డ్యాడ్‌గా నిలిచారు. ఇప్పుడు ట్విట్టర్‌లో 80 లక్షల ఫాలోవర్స్ తో మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే 90 లక్షల ఫాలోవర్స్ తో అమితాబ్ మొదటి స్థానంలో వున్నారు. షారుఖ్ తర్వాత స్థానాల్లో 7లక్షల పై చిలుకు ఫాలోవర్స్ తో సల్మాన్ ఖాన్ ,అమీర్ ఖాన్ లు వున్నారు.