English | Telugu
రన్ రాజా రన్ ట్రెయిలర్స్‌లో శర్వానంద్ న్యూలుక్
Updated : Jun 18, 2014
ఆల్‌రెడీ డీసెంట్ లుక్, డీసెంట్ ఇమేజ్ వున్న శర్వానంద్ ఇకపై కూల్ అండ్ ఫన్ గై గా కనిపిస్తే ఎలా వుంటుంది. అయితే "రన్ రాజా రన్'' ఫస్ట్ లుక్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్ ట్రెయిలర్లు రిలీజ్ అయి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అమ్మ చెప్పింది సినిమాలో అమాయకుడిగా కనిపించిన శర్వానంద్, "రన్ రాజా రన్'' సినిమా హీరో ఒక్కరే అంటే పోల్చుకోలేం. అంత హ్యాండ్‌సమ్ అండ్ కూల్ లుక్స్ తో కనిపిస్తున్నాడు శర్వానంద్.
సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు కలిసి నిర్మించారు. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌కి ప్రభాస్, గోపిచంద్ లు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో డిఫరెంట్ గా వుంటాడని ఆడియో ఫంక్షన్ లో చెబితే, అందరూ చెప్పే రోటీన్ మాటే అనుకున్నారు. కానీ నిజంగానే శర్వానంద్ ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు. విడుదలైన వీడియోలు చూస్తుంటే ఈ సినిమాలో కామెడీ, లవ్ రెండూ ట్రాక్‌లు బేషుగ్గా వుంటాయనిపిస్తోంది. ఈ చిత్రం ద్వారా శర్వానంద్ కొత్త ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.