English | Telugu
'ఐ'ని అడ్డుకొనేందుకు తొలి అస్త్రం సంధించారు
Updated : Jan 3, 2015
సంక్రాంతికి 'గోపాల గోపాల'కు గట్టి పోటీ ఇవ్వబోతున్న చిత్రం `ఐ`. శంకర్ సినిమా అంటే పిచ్చ క్రేజ్. `ఐ` ప్రచార చిత్రాలతో అది మరింత రెట్టింపయ్యింది. గోపాల గోపాల కలెక్షన్లు తగ్గించే సత్తా శంకర్ సినిమాకి ఉంది. అందుకే 'ఐ'ని అడ్డుకొనేందుకు డి.సురేష్ బాబు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అందులో భాగంగానే శుక్రవారం నట్టికుమార్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ''మన పండక్కి తమిళ సినిమా విడుదల కావడం ఏమిటి?? శంకర్ సినిమా ఎప్పుడొచ్చినా జనం చూస్తారు. 'ఐ' బదులుగా మరో తెలుగు సినిమాకి అవకాశం ఇవ్వాలి..'' అని నట్టికుమార్ తెలుగు సినిమాలపై ప్రేమ ఒలకబోశాడు. `ఐ` కాదంటే ఇప్పటికిప్పుడు టెంపర్ విడుదల అవుతుందా?? లేదంటే 'పటాస్'కి ముందుకు తీసుకొస్తారా? ఈ ఛాన్సే లేదు. 'ఐ' రాకపోతే గోపాల గోపాల సోలోగా విడుదల చేసుకోవచ్చని, వసూళ్లన్నీ తన సినిమాకే వస్తాయని సురేష్ బాబు ప్లాన్. మరి ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో..?