English | Telugu
సరికొత్తగా 'గోపాల గోపాల' ఆడియో
Updated : Jan 3, 2015
టాలీవుడ్ లో సంక్రాంతికి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'గోపాల గోపాల'. ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయ౦ కోసం అభిమానులు ఆసక్తిని కనపబరుస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో రిలీజ్ జనవరి 4 న కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ఆడియో లాంచ్ ఫంక్షన్‌ని అన్ని ఆడియో ఫంక్షన్స్‌లా కాకుండా కాస్త విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారట. ఆడియో ఫంక్షన్స్ అనగానే స్టార్స్, గెస్టులు వచ్చేంతవరకు డ్యాన్సులతో టైమ్‌పాస్ చేసి ఆ తరువాత ఆడియో రిలీజ్ చేసి ప్రోగ్రాంకు ముగింపు పలుకుతారు. అయితే 'గోపాల గోపాల' విషయంలో మాత్రం అలా కాదట. స్టోరీకి తగిన విధంగానే ఆడియో ఫంక్షన్‌కి క్లాస్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ని ట్రెడిషనల్‌గా నిర్వహించనున్నారని సమాచారం. మరి ఆడియో 4 వ తేది అని కన్ఫర్మ్ అయ్యింది. ఇంతకీ సినిమా విడుదల ఎప్పుడు? 9న లేదా 14న? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.