English | Telugu
ట్విట్టర్‌లో పవన్ మేనియా
Updated : Jan 3, 2015
తెలుగు ఇంటర్నెట్ సెలబ్రిటీ జాబితా తయారుచేస్తే మొదటి వరుసలో ఉండే పవన్ కళ్యాణ్ అందరికీ భిన్నంగా ఇంతకాలం ట్విట్టరుకు దూరంగా ఉన్నారు. అయితే, తాజాగా ఆయన నూతన సంవత్సరం సందర్భంగా @pawankalyan పేరుతో ట్విట్టర్ అక్కౌంట్ ఓపెన్ చేశారు. అక్కౌంట్ ఓపెన్ చేసిన ఐదు నిమిషాల్లో సభ్యుల సంఖ్య వేలల్లోకి చేరారు. ప్రారభించిన కొద్ది గంటల్లోనే పది వేలు దాటేసిన ఫాలోవర్స్, ఈ రోజు ఉదయానికి నలభై వేలకు చేరుకున్నారు. మధ్యాహ్నానికి 70 వేలకు పైగా ఆ సంఖ్య చేరుకుంది. సాయంత్రానికి ఈజీగా ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుందనేది ఓ అంచనా. రాజకీయాల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ అక్కౌంట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందించడానికైనా, ప్రశ్నించడానికైనా, విమర్శించడానికైనా ట్విట్టరు మంచి వేదిక అవుతుంది. ఒక వేళ మీడియా ఏదైనా వక్రీకరించినా ఎవరైనా విమర్శలు చేసిన ట్విట్టరు ద్వారా సమయం వృథా కాకుండా ఒక్కమాటలో సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే సమీప మిత్రుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ ట్విటరులోకి అడుగుపెట్టారు.“తెలుగు ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు, శాంతి-ఆరోగ్యం అందరికీ చేకూరాలి” ఇది పవన్ తొలి ట్వీట్! అసలు వార్త ఇది కాదు. ట్విట్టరు అక్కౌంట్ ఓపెన్ చేసిన చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఇప్పటికీ ‘ట్విట్టర్ ఇంక్’ అఫిషియల్ ట్యాగ్ ఇవ్వలేదు. కానీ కేవలం గంటన్నరలో పవన్ కళ్యాణ్ కి అఫిషియల్ ట్యాగ్ ఇచ్చేసింది. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ట్విట్టర్‌ని ఊపేస్తోన్న స్టార్‌గా పవన్‌కళ్యాణ్ రికార్డులకెక్కాడు.