English | Telugu

‘ఐ’ బాబోయ్ అలా చేస్తోంది!!

శంకర్ సినిమా అంటే గల్లాపెట్టే మీద త‌డిగుడ్డ వేసుకొని హాయిగా ప‌డుకోవ‌చ్చనుకొంటారు నిర్మాత‌లు. అంత ధైర్యం ఇచ్చాడు శంకర్‌. అత‌ని నుంచి సినిమా వ‌స్తోందంటే యావ‌త్ భార‌త దేశం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. దానికి త‌గిన‌ట్టు శంక‌ర్ కూడా భారీ క‌స‌ర‌త్తులు చేస్తాడు. ప‌క‌డ్బందీ ప్లానింగ్ తో సినిమా పూర్తి చేసి సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగు లో ఈ ‘ఐ’ సినిమా అనువాద హక్కులను ఎన్‌.వి. ప్రసాద్‌ ముప్పయ్‌ ఆరు కోట్లకి తీసుకుంటే పెద్ద రిస్క్‌ ఇండస్ట్రీ వర్గాలు అన్నాయి. ఇప్పుడు ఆ సినిమా చేస్తున్న బిజినేస్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌తోనే నలభై కోట్లు చేసిందని, ఆల్రెడీ నిర్మాత లాభాల్లోకి చేరుకున్నారని, ఇంకా శాటిలైట్‌ రైట్స్‌లో కూడా యాభై శాతం వాటా వస్తుందని, అది కాక సినిమాకి లాభాలొస్తే అందులోను వాటా ఉందని ట్రేడ్‌ రిపోర్ట్‌. శంకర్‌ నాలుగేళ్ల క్రితం తీసిన రోబో తెలుగులో 38 కోట్ల షేర్‌ రాబట్టింది. మరి ఇప్పుడు 'ఐ'తో ఆ రికార్డ్ బద్దలు కొడతాడో లేదో?