English | Telugu
టాలీవుడ్ లో కొత్త సూర్యుడు వచ్చాడు
Updated : Jan 7, 2015
నిఖిల్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న సినిమా సూర్య వెర్సస్ సూర్య. స్వామిరారా, కార్తికేయ వంటి వరుస హిట్లతో మంచి ఊపుమీదున్న నిఖిల్ చేస్తున్న మరో సినిమానే సూర్య వెర్సస్ సూర్య. ఈ సినిమాపై అభిమానులలో మంచి అంచనాలే వున్నాయి. అందుకు తగ్గట్టుగానే వుంది ఈ సినిమా టీజర్. ఎండలోకి వెళ్తే సమస్య వచ్చే కుర్రాడి ప్రేమకథ ఈ సినిమా. రాత్రి వేళ మాత్రమే బయట తిరుగుతూ జీవితం సాగిస్తుంటాడు. అలాంటి కుర్రాడు ప్రేమలో పడితే పరిస్థితి ఏంటి? అనే కాన్సెప్ట్ వస్తున్న సినిమా ఇది. టీజర్ కూడా సినిమా మంచి అంచనాలు పెంచేలా వుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. ఒక్క రోజు షూటింగ్ మాత్రమే బకాయి వుంది. కార్తికేయ సినిమా అందించిన చందు దీనికి మాటల రచయిత కావడం విశేషం.