English | Telugu
పవన్ కు చేపల పులుసు చేసిచ్చిన షకలక శంకర్
Updated : Mar 19, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ వెనక కానిస్టేబుల్ గెటప్ లో కనిపిస్తాడు షకలక శంకర్. సినిమాలో ఇతనికి కాస్త మంచి పాత్రే పడింది. అయితే రీసెంట్ గా పవన్ షకలక ను కొట్టాడనే వార్త బాగా హల్ చల్ చేసింది. డైరెక్టర్ పై జోకులు వేస్తూ విసిగించాడని, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వినకపోవడంతో, పవన్ చేయిచేసుకున్నాడని ఆ రూమర్ సారాంశం. దీనిపై నోరు విప్పాడు షకలక శంకర్. పవన్ తనకు దేవుడికంటే ఎక్కువని, ఆయన అసలు తనను కొట్టనే లేదని చెబుతున్నాడు. పైగా తనే చేపల పులుసు చేసి తీసుకెళ్లి పవన్ కు ఇచ్చానని, ఆయన చాలా ఇష్టంగా తిన్నారని శంకర్ అంటున్నాడు. యాక్టింగ్ చేసేప్పుడు ఎక్కడైన తేడా వస్తే పవన్ చెప్పేవారని, ఆ పరంగా వార్నింగ్ ఇచ్చాడు తప్ప, ఇంకెలాంటి సంఘటన జరగలేదని క్లారిఫికేషన్ ఇచ్చేశాడు షకలక. దీంతో షకలకపై వచ్చిన రూమర్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్టే.